వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలపై ఈ నెల 24న ఢిల్లీలో జగన్మోహన్‌రెడ్డి దీక్షకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ దీక్షపై వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు విచారణకు సంబంధించి ఎందుకు దీక్ష చేయడం లేదంటూ ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ హత్యా రాజకీయాలు, సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని. వివేకా హంతకులతో జగన్మోహన్‌రెడ్డి తిరుగుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
బాబాయి వివేకానందరెడ్డి హత్యపై ఢిల్లీ ఎందుకు దీక్ష చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వినుకొండ హత్య వ్యక్తిగత కక్షలతో జరిగిందన్న షర్మిల.. అది రాజకీయ హత్య కాదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డికి ప్రత్యేక హోదా గుర్తు రాలేదని, అధికారం కోల్పోయిన తరువాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడేందుకు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు, కడప, విశాఖ ఉక్కు పరిశ్రమల గురించి జగన్ ఎన్నడూ పట్టించుకోలేదన్న షర్మిల.. ఇప్పుడు మాత్రం వాటి గురించి మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురి చేశారన్నారు. కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ఎవరైనా దీక్ష చేస్తారా..? అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను తప్పించుకునేఉద్ధేశంతోనే జగన్ దీక్ష పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా చర్చల్లో పాల్గొనకుండా చేస్తారా..? అని నిలదీశారు. ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం లేదనుకుంటున్నారా..? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా స్వీకరించే బాధ్యతను చంద్రబాబు నాయుడు తీసుకోవాలన్న షర్మిల.. ఈ మేరకు తీవ్రంగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని, లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. చితికిపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని షర్మిల వివరాలు.