ఢిల్లీలో తమ ధర్నాకు కాంగ్రెస్ నేతలు ఎందుకు మద్దతు ప్రకటించలేదో ఆ పార్టీని అడగాలన్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా జగన్ కు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ గారు మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి..? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా.? వ్యక్తిగత హత్యకు రాజకీయరంగు పులిమినందుకా..? 5 ఏళ్లు బిజెపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బిజెపికి తాకట్టుపెట్టి, ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిస్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బిజెపికే మద్దతు ఇచ్చారు కదా.? వైఎస్ఆర్ వ్యతిరేకించిన మతతత్వ బిజెపికి జై కొట్టారు కదా.? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి వచ్చిందా సంఘీభావం.? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది.
సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడదాం అంటున్నారు..? అని ట్విట్టర్ వేదికగా షర్మిల వైఎస్ జగన్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం రాజకీయంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేసిన దానికి తెలుగుదేశం పార్టీ జనసేన నేతలకంటే వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించూ కౌంటర్లు ఇస్తుండడం విశేషం. అన్నా, చెల్లెళ్ళ మధ్య రాజకీయంగా వైరం బాగా పెరిగిపోయింది అనడానికి తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ కారణంగా. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కోరుతున్న మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఢిల్లీలో ధర్నాకు అన్ని పక్షాల నేతలను ఆహ్వానించామని, కానీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాత్రం రాలేదని అన్నారు. తమ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు రాలేదో ఆ పార్టీ నేతలు అడగాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మణిపూర్ అల్లర్లపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో జరిగిన హింసపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ షర్మిలకు తాజాగా ఈ కౌంటర్ ఇచ్చారు.
కాల్పులు జరిగిన చోటే మరోసారి ర్యాలీ నిర్వహించారు : డోనాల్డ్ ట్రంప్
రీసెంట్గా విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీరే..