రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనేక విభాగాల్లో ప్రచారాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక హామీలను ఇచ్చారు. వీటిలో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నైపుణ్య గణన చేపడతామని అప్పట్లో ఇరువురు నేతలు అనేక సభల్లో ఉన్నారు. తాజాగా ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నారా చంద్రబాబు నాయుడు సంతకం కూడా స్కిల్ సెన్సెస్ ఫైల్ పైనే చేశారు. ఈ ప్రోగ్రామ్ ను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్ అందుబాటులోకి వస్తోంది. నైపుణ్యం గణనలో భాగంగా చదువుకున్న వారి వివరాలను పొందుపరచడంతోపాటు వాటిని వెలికితీసే చర్యలను చేపట్టనుంది. 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసున్న వారి నైపుణ్యాలను గుర్తించేందుకు గణన ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రజల ఇష్టాలను తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కిల్ గణన కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ప్రజల నైపుణ్యాలను గుర్తించనుంది. వారు ఏ రంగాల్లో రాణించాలన్న ఆలోచనలో ఉన్నారో వంటి అంశాలను అందులో పొందుపరచనుంది. కేవలం ఉద్యోగాల కోసం వారి వివరాలతోపాటు వ్యవసాయం సహా ఇతర చేతి వృత్తులు చేసుకునే వారి వివరాలను కూడా ఇందులో చేర్చనున్నారు. ఇలా చేయడం వల్ల ఏ రంగాల్లో ఎంతమంది ఉన్నారన్న దానిపై ప్రభుత్వానికి ఒక స్పష్టత రానుంది. అలాగే, యువతకు ఉన్న ఆసక్తిని తెలుసుకొని వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఆయా రంగాల్లో మరింత మెరుగైన నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఈ యాప్లో యువతకు సంబంధించిన నైపుణ్యాలను పొందడం ద్వారా పరిశ్రమలను వారితో అనుసంధానం చేసి వారి నైపుణ్యానికి అనుగుణమైన పరిశ్రమల్లో ఉపాధి కల్పించనున్నారు. ఇందులో స్కిల్ డెవలప్మెంట్ అధికారులను భాగస్వాములను చేయనున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను పట్టాలెక్కించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే యాప్ లో ఎక్కడి నుంచైనా లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్ ఉంటే నెంబర్ సరిపోతుంది. ఫోన్ నంబర్ కి వచ్చే ఓటిపి ద్వారా లాగిన్ కావచ్చు. అందులో వ్యక్తిగత వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఏపీకి చెందిన వారైతే ఈ యాప్లో తమ వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో విధానంలో కూడా వివరాలు పొందుపరిచే వెసులుబాటు ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి ఈ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఒక్కొక్కరు 20 మంది వివరాలను సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
టిడిపిలో బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు కలకలం.. సిఐల బదిలీలపై హాట్ కామెంట్స్
ఒలింపిక్స్ బ్రాంజ్ బ్యూటీ.. ఎవరీ మను భాకర్