విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా – విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. బోగీలు తగలబడిపోయాయి. బీ2. బీ71బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకుంటున్నాయి. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి వేస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణాలా? మరేదైనా జరిగిందా? అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఒక్కసారిగా విశాఖ రైల్వే స్టేషన్ లో మంటలు చెలరేగి పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.