తనకు భద్రత పెంచాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆయనకు భద్రత తగ్గించిందని జగన్ లాయర్లు వాదనలు వినిపించారు.
వాదనలు విన్న ధర్మాసనం జగన్ భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయన మాజీ సీఎం అని.. ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. జగన్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. జామర్ వెహికల్ కూడా కేటాయిస్తానని కోర్టుకు ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.