ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అనేక ప్రాంతాల్లో దాడులు, వైసీపీ శ్రేణుల హత్యకాండ. కొన్నిచోట్ల ఎన్నడూ చూడని విధంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు పైన ఇష్టం వచ్చినట్లు ఉన్నారు. ఈ తరహా ఘటనలపై తీవ్ర స్థాయిలో స్పందించే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీస స్థాయిలో స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుతం ఆయన ఉన్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు భిన్నమైన రీతిలో ఉంటాయి. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించే గుణం ఆయనది అని ఇప్పటి వరకు అంతా నమ్ముతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇదే బలంగా చెబుతుంటారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఆయన అనేక విషయాలపై స్పందించకపోవడమేనని అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు గురించి ఆయన స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల చిన్నారులపై జరిగిన దాడులు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరిగిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.. ఈ తరహా ఘటనలు ప్రతిసారి తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గతంలో స్పందించారు. కానీ ఉపముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తరహా ఘటనలో ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించిన యువతి ఆచూకీ తెలుసుకునేలా చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన ఈ తరహా ఘటనలను పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించకూడదు అన్న ఆదేశాలు ఉన్నాయా..? లేక ప్రస్తుత వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ మౌనాన్ని దాల్చారా.? అన్నది తెలియాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఘటనలపై
19