వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దారుణంగా హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు. విజయవాడ నుంచి ఓర్వకల్లుకు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో సీతారామపురం చేరుకుంటారు. హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి భరోసా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించనున్నారు. సుబ్బరాయుడు కుటుంబానికి అండగా ఉంటామని ఇప్పటికే పార్టీ నాయకులు. సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లుకు పయనం కానున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు ఓర్వకల్లుకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలను సీతారాంపురం వెళ్లేందుకు అవకాశం ఎక్కడికక్కడ అడ్డుకునే చర్యలను వేగవంతం చేశారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించే అవకాశం..
రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా దారుణమైన రీతిలో హత్యకాండ కొనసాగిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే తమకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారని దానిపై సర్వత్ర ఆసక్తి చూపారు.
బ్యాంకు ఖాతా లేకపోయినా ఇకపై యుపిఐ చెల్లింపులు.. ఆర్బిఐ కీలక నిర్ణయం
బంగారం కొనడానికి వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు..!