విశాఖపట్నం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన కోసం స్వతంత్ర అభ్యర్థి షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆయన ప్రతినిధి. అన్ని పత్రాలు ఉండటంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. అయితే, స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు బుధవారమే పత్రాలు దాఖలు చేశారు. దీంతో వైసిపి అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో నిలిచారు. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత అధికారికంగా బొత్స సత్యనారాయణ ఎన్నికను అధికారులు ప్రకటిస్తారు. కాగా ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కోడ్ తొలగిపోతుంది. ఈ పరిశీలన రిటర్నింగ్ అధికారి మయూర్ అశోక్. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కూటమి నాయకులు.. తర్వాత పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పోటీపై పార్టీ నాయకుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇబ్బందులు ఉన్నాయని భావించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూటమి ఉండాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో ఓటర్లుగా స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తంగా 800 మందికి పైగా ఓటర్లు ఉండగా, వైసీపీకి సుమారు 600 మంది ఉన్నారు. భారీ తేడా ఉండటంతో గెలిచే అవకాశాలు ఉండవన్న అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యక్తం చేయడంతో నారా చంద్రబాబు నాయుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు గాను వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన మంత్రిగా ఐదేళ్లపాటు విజయం సాధించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మరోసారి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయంగా తొలిసారి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బొత్స సత్యనారాయణను మళ్ళీ శాసనమండలికి పంపించాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను విశాఖపట్నం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించారు జగన్మోహన్ రెడ్డి. ఒకానొక దశలో పోటీకి దిగాలని కోటమి నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను సాగించారు. నాయకుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పన్నుతూ బొత్స తమ ఓటర్లను కాపాడుకునే ప్రయత్నాలను సాగించారు. బొత్స వ్యూహాలను తిప్పి కొట్టడంలో ఫెయిల్ అయిన టిడిపి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంచనం అయింది. బొత్స ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టడం వల్ల వైసీపీకి మరింత బలం పెరుగుతుంది. సీనియర్ నేత కావడంతో బొత్స మండలిలో పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉండనుంది.
Beauty Tips : రాత్రి పడుకునే ముందు ముఖానికి ఇవి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది
పెళ్లికి రెడీ అయ్యే జంటలు ఈ మెడికల్స్ చేయించుకోవడం ఉత్తమం