OverdriveNTool is a software application https://bittention.com/programs/overdriventool/ designed for AMD Radeon GPUs. It lets users tweak core clock speed, memory frequency, voltage settings, fan speeds, and power constraints on their graphics cards.

Advanced programs designed to fine-tune the GPU encourage all users of the computers to pick and use one of the most suitable programs. MorePowerTool https://getpc.top/programs/morepowertool/ is renowned for its extraordinary features to increase the frequency of the processor, reduce power consumption, and perform other important actions.

Микрокредит с плохой кредитной историей в Казахстане https://mikrokredity-online.kz/loans/mikrokredit-s-plohoj-kreditnoj-istoriej— это возможность для людей с негативным кредитным прошлым получить небольшую сумму денег в долг. Многие микрофинансовые организации (МФО) в стране готовы рассмотреть заявки от клиентов с испорченной кредитной историей, так как они в первую очередь ориентируются на текущую платежеспособность заемщика.

Home ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు మాజీ మంత్రి బొత్సకు.. కీలక మార్పుల దిశగా వైసీపీ అధినేత – Swen Daily

ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు మాజీ మంత్రి బొత్సకు.. కీలక మార్పుల దిశగా వైసీపీ అధినేత – Swen Daily

by Admin_swen
0 comments
ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు మాజీ మంత్రి బొత్సకు.. కీలక మార్పుల దిశగా వైసీపీ అధినేత


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఈయన బాధ్యతగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అధికారం కోల్పోయిన తర్వాత కొద్దిరోజుల కింద జరిగిన జీవీసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసిపి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. జీవీసీలో మెజారిటీ ప్రత్యక్ష వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు. ఈ వ్యవహారాలన్నీ ఉత్తరాంధ్రకు సంబంధించి మార్పులు చేర్పులు చేసే దిశగా చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డిని తొలగించి తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. అపార అనుభవంతోపాటు మూడు జిల్లాల్లో ఆయనకు పెద్ద ఎత్తున అనుచరగణం కూడా ఉంది. పార్టీలో ఏర్పడే క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దడం బొత్సకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది నిరూపితం అయింది కూడా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ కాకుండా మరొకరిని అభ్యర్థిగా వైసిపి బరిలోకి దించి ఉంటే ఈ మొత్తాన్ని కోల్పోయేది వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బొత్స సత్యనారాయణ పార్టీ అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత తన వ్యూహాలను ప్రణాళిక ప్రకారం అమలు చేశారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలను ఎంపీటీసీలు, జడ్పిటిసిలను బెంగుళూరులోని క్యాంపుకు చూస్తున్నారు. దీంతో వైసీపీకి చెందిన నాయకులతో టిడిపి ముఖ్య నేతలు సంప్రదింపులు చేసేందుకు అవకాశం పోయింది. అదే సమయంలో వైసీపీకి మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్ ఈ ఎమ్మెల్సీ ఎంపికయ్యారు. అయితే బొత్స సత్యనారాయణకు ఖరారు చేసిన తర్వాత వీరు కూడా ఎటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రచారం నిమిత్తం ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు బొత్స వెంట ఈ ఇద్దరు నేతలు కూడా తప్పనిసరిగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీ నేతలు అంతా ఉమ్మడిగా పనిచేస్తున్నారు అనే భావన ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కలిగింది. ఈ తరుణంలో పార్టీకి అండగా ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా కలిగించడంలో బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. అన్ని ఎమ్మెల్సీలకు ఏకగ్రీవంగా సహాయం అందించారు. ఒకరకంగా చెప్పాలంటే మాజీమంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ చాతుర్యమే ఈ ఎమ్మెల్సీ వైసీపీకి కట్టబెట్టినట్లు చెబుతున్నారు.

పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం

ఉత్తరాంధ్ర పార్టీల బాధ్యత ఆ ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. మూడు జిల్లాల్లో బొత్స సత్యనారాయణకు బలమైన అనుచరగణం ఉంది. క్షేత్రస్థాయిలోనే నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని బొత్స సత్యనారాయణకు పార్టీ బాధ్యతలను అప్పగించేలా చెబుతున్నారు. వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించి ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి అప్పగించే అవకాశం లేదు. అదే జరిగితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైసిపి సరికొత్త రాజకీయాలను అనుసరించే అవకాశం ఉందని తెలుస్తోంది. బొత్స సూచనతోనే టెక్కలి వైసిపి ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాసుని మార్చినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్రమైన ఇబ్బందుల్లో పడిన వైసీపీని ఒడ్డున చేర్చే పనిని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ సంస్కరణలను ఉత్తరాంధ్ర నుంచే అమలు చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో వాహన చోదకులకు భారీ షాక్.. భారీగా పెరగనున్న ట్రాఫిక్ చలాన్లు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech