ఉమ్మడి విశాఖ జిల్లాలో గడచిన కొద్ది రోజుల నుంచి వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విభజిత అనకాపల్లి జిల్లాలో కొద్దిరోజుల కింద ఎసెన్షియ ఫార్మా పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. ఆ తరవాత జరిగిన మరో పరిశ్రమలో ప్రమాదం సంభవించడంతో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలు జరిగే రెండు వారాలు గడవక శుక్రవారం రాత్రి మరో ప్రమాదం విశాఖలో జరిగింది. శ్రావణ్ షిప్పింగ్స్ సంస్థలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలందించారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్ ను ఒక కంటెయిన్ నుంచి మరో కంటెయిన్ కు మార్చుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చడంతో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్. ఘటన జరిగినప్పటి నుంచి పరిస్థితిని కలెక్టర్ సమీక్షిస్తున్నారు.
తెల్లవారుజాము రెండు ఆసుపత్రికి తరలింపు..
ఎసిటానిలైడ్ అనే విషవాయువు లీక్ కాగా, దానిని పీల్చి ఐదుగురు కార్మికులు ఆస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి రెండు గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చికిత్స అందించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా కోరుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్ ఇతర అధికారి అధికారి ప్రమాదం జరిగిన శ్రావణ్ షిప్పింగ్ సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న తర్వాత బాధితులు చికిత్స పొందుతున్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు.
నవ్వుతోనే ఇకపై డబ్బు చెల్లింపు.. స్మైల్ పేమెంట్ ముఖ గుర్తింపు చెల్లింపు వ్యవస్థ
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్