రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, కురుస్తున్న వర్షాలు, చేపడుతున్న సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాల గురించి ఆయన ఆరా తీశారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు అధికారులతో వర్షాలపై తాజా పరిస్థితిని అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. విజయవాడ, గుంటూరులో వెంటనే చర్యలు చేపట్టామని చెప్పారు. వరదల నేపథ్యంలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందని. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. విజయవాడలో కొండ చరియలు పడి చనిపోవడం బాధాకరమన్నారు. వరదల వల్ల 9 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయినట్లు సీఎం వివరించారు. కాజా, టోలెట్, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందని, అధికారులతో సమీక్ష పొందినట్లు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రాష్ట్రంలో 32.3 సెంటీమీటర్లు, 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్న చంద్రబాబు.. జగ్గయ్యపేటలో 26.1 సెంటీమీటర్ల వర్షపాతం, తిరువూరులో 26 సెంటీమీటర్లు, గుంటూరులో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, అధికారులతో సమీక్ష జరిపి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయడం వలన ప్రాణ నష్టం ఎక్కువ కాకుండా చూడగలిగామని వివరించారు. వరదలతో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. భారీ వర్షాలతో అన్ని జలశయాలు నిండిపోయాయి.
ప్రజలను కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యం
ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి, పొర్లుతున్నాయని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. పులిచింతల నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. బుడమేరు వల్ల వీటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తి ఆగిందని, ప్రకాశం బ్యారేజీ కింద పలుచోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు వేసుకున్నట్లు సీఎం. వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టినట్లు సీఎం వివరించారు. 17 వేల మందిని క్యాలకు తరలించినట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వరద ముంపు ప్రాంతాలకు బోట్లు పంపించినట్లు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినట్లు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ తక్షణ కర్తవ్యం అని తెలియజేసారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నామని. వరద ప్రాంతాలలో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ వివరించారు. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నట్లు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాలను కమ్మేస్తున్న జ్వరాలు.. ప్రతి ఇంటిలోనూ బాధితులు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్