ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ఇటీవల కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో ఏరియల్ సర్వే జరిగింది. ఈరోజు కేంద్రబృందం బ్యారేజీని పరిశీలించింది.
బ్యారేజీ నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలను జలవనరుల అధికారులు కేంద్ర బృందానికి ఏర్పాటు చేశారు. ఈఎస్సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. ఈ నెల 1న రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు.