సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్‌లను మార్చిన ఆయన.. పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించారు. పార్టీలోనూ కీలక మార్పులు చేశారు. తాజాగా పార్టీ సలహాదారుగా బీజీపీకి పని చేసిన వ్యక్తిని నియమించారు. ఈ వాటానే కీలక నియామకాలను ఆయన నియమించారు. పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత మాజీ మంత్రులు పేర్ని నానీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్ తప్ప ఎవరూ మీడియా ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడడం లేదు. కీలకమైన వాయిస్ పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోనిందని భావించిన జగన్మోహన్‌రెడ్డి.. ఈ మేరకు బలమైన వాయిస్ వినిపించే వారికి పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ చైర్మన్‌గా పని చేసిన భూమణ కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి శ్యామల ఉన్నారు. వీరిలో భూమన కరుణాకర్ రెడ్డి మినహీ మిగిలిన ముగ్గురు తమదైన శైలిలో వాగ్ధాటిని వినిపించగల నేతలే.
ఇటీవల పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన రవిచంద్రారెడ్డి ఒక మీడియా సంస్థలో మాట్లాడుతూ పార్టీ పెద్దలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి డ్యామేజ్ చేసేవిగా ఉండటంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే మీడియా చానెల్స్‌లో మాట్లాడే నాయకులకు సంబంధించిన జాబితాను వైసీపీ విడుదల చేసింది. మొత్తంగా 14 మందితో జాబితాను విడుదల చేసిన పార్టీ.. తాజాగా అధికార ప్రతినిధులను నియమిస్తూ ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ విధంగానే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ఈ నేతలు చేస్తారని ఆ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే సినీ నటి శ్యామలకు అధికార ప్రతినిధిగా పార్టీ అవకాశం కల్పించడాన్ని ప్రమోషన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కూడా ఆమెకు అండగా ఉందన్న తాజా నియామకంతో తెలియజేసినట్టు అయిందని పలువురు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్ధతు తెలియజేయడంతో జనసేనతోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆమెను తీవ్రస్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు. పార్టీ ఓటమి తరువాత ఒకరకంగా వేధింపులు పెరిగాయి. ఈ కారణంగానే ఆమెకు వైసీపీ కీలక బాధ్యతలను అప్పగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
స్త్రీలకు అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి? దీని వెనుక ఉన్న కారణమేంటో తెలుసా
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్