గోదావరి నది నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతుండడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ వెలుగు చూస్తున్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యానాం దర్యాలతిప్ప, కాట్రేనికోన మండలం బులుసు తిప్ప మధ్య గోదావరిలో ఓఎన్జీసీ సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేసింది. ఈ గ్యాస్ పైప్ లైన్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి నుంచి లీక్ అవుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ లీకేజీని అధికారులు గుర్తించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి రావడంతో మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగా పెద్ద ఎత్తున నీళ్లు తిరుగుతూ కనిపిస్తున్నాయి. గ్యాస్ లీకేజీ వలన భారీగా దుర్వాసన వస్తుందని, దీనిని భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు యాజమాన్య సంస్థ స్పందించిన స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఓఎన్జిసి సంస్థ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని స్థానికులు మండిపడుతున్నారు. గ్యాస్ లీకేజీ వ్యవహారంపై ఓఎన్జీ సంస్థకు చెందిన అధికారులు, ప్రభుత్వ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. స్వల్ప ప్రమాదంగా ఉన్నప్పుడు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటే భారీ ప్రమాదానికి ఆస్కారం ఉండదని, భారీ ఎత్తున ప్రమాదం సంభవించిన తర్వాత ఏం చేసినా ఉపయోగం ఉండదని చూస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్యాస్ ఘటనల వల్ల మంటలు చెలరేగి గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అయితే రాత్రి నుంచి గ్యాస్ లీక్ అవుతున్న ఓఎన్జీసీ అధికారులు గానీ, ఇక ప్రభుత్వ అధికారులు కానీ స్పందించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెను ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి మాటలు చెప్పడం కంటే.. ముందే తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నారు.
చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం ఆఫ్గాన్ జట్టు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్