దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఉన్నారు. దాదాపు మూడు నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. చివరిసారిగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై అభిమానుల ముందుకు వచ్చింది. తర్వాత నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణ ఫలిస్తోంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల. ఈ మేరకు చిత్ర యూనిట్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే అనేక విభాగాల్లో జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు చిత్ర యూనిట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినిమా యూనిట్ కు శుభవార్త అందింది.
దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మల్టీఫ్లెక్స్ ఒక్కో టికెట్ పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్లపై రూ.110, లోయర్ క్లాస్ టికెట్లపై రూ.60 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడంతోపాటు ఆదనపు షోలు వేసేందుకు అనుమతి లభించడం పట్ల చిత్ర యూనిట్ కూడా హర్షాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ సినిమా భారీగా అంచనాలను పెంచేసింది. కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా భారీ హిట్ నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం దేవర కావడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా దేవర సినిమా పట్ల సానుకూల దృక్పథంతో అనుమతులను ఇవ్వడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో భారీగా వర్షాలు
కీర్తి సురేష్ | నీలం రంగు చీరలో కీర్తి సురేశ్