తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో ఏకంగా జంతువుల కొవ్వును సైతం వినియోగించారని టీడీపీ (TDP) ఆధారాలు చూపించారు. ఈ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షప్రారంభించారు. తిరుమల క్షేత్రంలో జరిగిన అపవిత్రానికి క్షమించమని ఈ తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటన.ఈ మేరకు నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ ఈ దీక్షను స్వీకరించారు. ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్‌కు దీక్షాకంకణం కట్టి ఆశీర్వదించారు. ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తేదీ (పై వచ్చే బుధవారం) వరకు కొనసాగనుంది. దీక్ష తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా తిరుమల వెళ్లనున్నారు.