తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ప్రసాదంగా లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారంటూ జరుగుతున్న వివాదం రోజురోజుకు పెరుగుతోంది. కల్తీ నెయ్యి వినియోగించడం ద్వారా అపవిత్రం అయిందంటూ మూడు రోజులుగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం దుర్గగుడిలో శుద్ధి అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి సనాతన ధర్మానికి అవమానం జరుగుతుంటే మౌనంగా ఉంటున్నారని హిందువులను ప్రశ్నించారు. ఇదే వ్యవహారం మరో మతంలో, మరో ప్రాంతంలో జరిగితే పరిస్థితి ఇలానే ఉండేదా.? అని ప్రశ్నించారు. హిందువుల మౌనాన్ని చేతకానితనంగా ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి తాను సనాతన ధర్మాన్ని నిష్ఠతో పాటించాలని ఇంట్లో ఎప్పుడూ రామనామ జపం వినిపించేదన్నారు. పండగల సమయంలో తప్ప ఆ నివేదన పెద్దగా ప్రొజెక్టు చేసుకోమని, తానే కాదు ఏ హిందువైనా సరే అలానే చేస్తాడని చెప్పుకొచ్చారు. కానీ, ఇక్కడ హిందువులే హిందువులకు శత్రువుగా మారాలని, సనాతన ధర్మంపై వచ్చినట్లు మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో హిందూ సంప్రదాయాలను పాటించే వారంతా మీడియా కనిపించే వేరే వేదికలపై తన సంప్రదాయాలను కించపరిచేలా మాట్లాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఇదే ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ అమ్మవారి సింహాలు మాయమైనప్పుడు, విజయనగరంలో విగ్రహాల తలలు విరగ్గొట్టినప్పుడు కూడా ఇలాంటి కూతలు విన్నామని స్పష్టం చేశారు.
హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లంతా కూడా హిందువులేనన్నారు. తప్పు చెబుతుంటే పదవులు అనుభవించిన వాళ్ళు వెటకారం లేదా ఆందోళన వ్యక్తం చేశారు. హైందవ ధర్మాన్ని కాపాడతానని పదవులు స్వీకరించారని, అందుకే జరిగిన వాటికి బాధ్యత వహించాలని హితవు పలికారు. ఈ వ్యవహారంలో జగన్ ను బ్లేమ్ చేయడం లేదన్న పవన్ కల్యాణ్.. తప్పులు గుర్తించారు. స్పష్టమైన ఆధారాలతో ఇటువంటి వాటిపై దృష్టి సారించాం. సెక్యులరిజం అంటే రెండు వైపుల నుంచి ఉండాలనే సూత్రాన్ని మర్చిపోతున్నారని. ఇదే చాలా మంది హిందువులకు ఆవేదన కలిగిస్తోందన్నారు. వ్యక్తిగత హిందూ ధర్మాలను పాటిస్తున్న వారే తోటి హిందువులను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై ఎవరినీ నిందించడం లేదన్న పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్న హిందువులు మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలని స్పష్టం చేశారు. విగ్రహాలు పోతే ఇల్లు కట్టుకుంటామంటూ గతంలో మాట్లాడారని గుర్తు చేశారు. మసీదులో ఇలాంటివి జరిగితే మాట్లాడతారని ప్రశ్నించారు. హిందువులు పట్టించుకోరని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు మాట్లాడిన ప్రతిసారి రాలేకపోతున్నామని, అందుకే సనాతన ధర్మ బోర్డు ఉండాలని తాము ప్రతిపాదించామని చెప్పారు. ప్రతిసారి కూర్చోబెట్టి డిఫెండ్ చేసుకోలేమని, ఇది ప్రతి సగటు హిందువు ధర్మం అని స్పష్టం చేశారు. ఇదే వేరే మతంపై దాడి చేస్తే ఎంతో మంది రియాక్ట్ అవుతారని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయమని చెప్పడం లేదని, కానీ కనీసం కోపాలు రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. గుడికి వెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా..? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
బీపీని తగ్గించడానికి 5 నేచురల్ టిప్స్
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..