రాష్ట్రంలో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న వాటిని కొనసాగించడంతోపాటు మరిన్ని కొత్త దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం రేషన్ ఉత్పత్తులకు వెళ్లి వినియోగదారులకు రేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ వాహనాల ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కూటమి డిపోలకు సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే కొత్త దుకాణాలు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను తయారు చేసే పనిని అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,774 రేషన్ షాపులు ఉన్నాయి. వీటిని మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. జనావాసాల్లో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ షాపులకు 400 నుంచి 450 కార్లుకు, పట్టణాల్లో 500 నుంచి 550 షాపులకు, నగరాల్లో అయితే 600 నుంచి 650 షాపులకు ఒక రేషన్ షాపు ఉంటే నూతన నిబందనలను ప్రభుత్వం తీసుకువస్తోంది. కొత్త కార్డులను ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కొత్త కార్డులు అందించే ప్రక్రియ తరువాత కొత్త రేషన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు చెబుతున్నారు. వచ్చే నెల 22వ తేదీలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నూనత రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు కొద్ది రోజుల్లోనే అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలను ఏం చేస్తుందన్న దానిపై ప్రస్తుతం ఆసక్తి చూపుతోంది. లక్షలాది
17