ఏపీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పోస్టులను బట్టి ప్రక్రియను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీను అధికారులు శనివారం రాత్రి విడుదల చేశారు. ఈ మూడు, నాలుగు తేదీల్లో జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను.. పరీక్ష జరిగిన మరుసటి రోజు విడుదల చేయనున్నారు. ఆన్సర్ ‘కీ’తోపాటు పరీక్ష ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తికి అనుగుణంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
ఆయా కాల్ సెంటర్ల నెంబర్లు 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 95056, 95056 [email protected] ద్వారా సంప్రదించడానికి అవకాశం ఉన్న విద్యాశాఖ అధికారులు. ఏపీలో టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అక్టోబర్ మూడున ప్రారంభమైన కంప్యూటర్ ఆధారిత అక్టోబర్ పరీక్షలు 21 వరకు కొనసాగుతున్నాయి. విడుదల చేసిన ఆన్సర్ కీ లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే త్వరలోనే అభ్యంతరాలను కలిగి ఉంటుంది. అక్టోబర్ 27న తుది కీ విడుదల చేసి నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏపీ టెట్ పరీక్షల్లో అర్హత మార్కులను ఓసీ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 40 శాతం మంది నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ టెట్ రాష్ట్రవ్యాప్తంగా 108 పరీక్షల్లో కేంద్రీకృతమైంది. ఏపీలోని 22 జిల్లాల్లో 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలో కలిపి 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతోంది. రెండు సెషన్లలో ఈ పరీక్షలను చేస్తారు.
ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం మీ కోసమే.. ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు దక్కే ఛాన్స్
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..