అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్ ఈ ఏడాది జూలై 4వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా, చైర్ పర్సన్‌గా ఏఆర్ అనురాధ నియమితులైనందున ఉద్యోగ నియామక ప్రకటనలు జోరందుకుంటున్నాయి. 2014-19లో టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన అనురాధ.. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సేవలను అందించారు. ఈమె 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఆమె భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్సే.
పైకి ఎగబాకుతున్న వెండి, బంగారం ధరలు.. లక్ష దాటిన కేజీ వెండి
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..