ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకూడదు అన్న ఉద్దేశంతో కొత్త కార్డులకు సంబంధించి చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు అవసరమైన అర్హులైన వారు మరో 5 వేల మంది వరకు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త ఏడాది నుంచి జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి కొత్త ఏడాదిలో 50వేల మందికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తొలి దశలో 50,000 మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి, మార్చిలో మిగిలిన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో రేషన్ ఆహార సంఖ్యను కూడా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,796 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలతో మరిన్ని దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదనంగా నాలుగువేల రేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
దీనివల్ల రేషన్ పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో రేషన్ దుకాణం పరిధిలో పట్టణాల్లో అయితే 700 రేషన్ కార్డులు ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో దుకాణం పరిధిలో 750 కార్డులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్ దుస్తులను ఏర్పాటు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6500 కంటే ఎక్కువ ఖాళీగా ఉన్న డీలర్ స్థానాలు ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న డీలర్ల పై అదనపు బాధ్యతలను తొలగించనున్నారు. కొత్త డీలర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు అదనపు రేషన్ ఉత్పత్తులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో రేషన్ సరుకులు పంపిణీకి సంబంధించి మెరుగైన విధానాలను అనుసరించే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ, రేషన్ షాపులు విస్తరణతో ప్రభుత్వం మరింత విస్తృతమైన నెట్‌వర్కు, మెరుగైన కవరేజీని లక్ష్యంగా చేసుకుంటుంది. రేషన్ డీలర్ల నియామక ప్రక్రియను కూడా వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను కొద్దిరోజుల్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూసి పునర్జీవ పాదయాత్రకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ నుంచే ప్రారంభం
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం బోటు సర్వీస్ విశేషాలివీ..