ఏపీ హైకోర్టులో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు ఊరట లభించింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన శిల్ప రవికి మద్దతుగా నిలిచేందుకు ఆయన నంద్యాల వెళ్లారు. నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ ను చూసేందుకు భారీగా అభిమానులు శిల్ప ఇంటికి తరలివచ్చారు. ఎన్నికల కోడ్ అమరలో ఉండటంతో అప్పట్లో పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జన సమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టులో నడుస్తోంది. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అనేక అంశాలను పరిశీలించి తుది తీర్పు బుధవారం వెలువడింది. ఈ తీర్పు బన్నీకి భారీ ఊరటను ఇచ్చినట్టు అయింది. పోలీసులు పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు ఇచ్చిన పిటిషన్ ను కొట్టు వేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్ కు ఉపశమనం దక్కినట్టు అయింది. కోర్టు తీర్పు నేపథ్యంలో అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా తీర్పుతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో శిల్ప రవికి మద్దతుగా నిలిచిన దగ్గరనుంచి జన సైనికులు, మెగా కుటుంబం అభిమానులు అల్లు అర్జున్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాల్లో ఇక దారుణమైన పరాభవాలను చూస్తారంటూ ట్రోల్ చేశారు. చిరంజీవి కుటుంబం అండతో ఎదిగి ఇప్పుడు ఆ కుటుంబానికే మోసం చేశాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. జన సైనికులు, మెగా అభిమానుల విమర్శలకు అంతే స్థాయిలో అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇస్తూ వచ్చారు.
ఇప్పటికీ వీరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. మధ్యలో ఒకసారి అల్లు అర్జున్ ను ఉద్దేశించి నాగబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. పెద్ద ఎత్తున అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో నాగబాబు ఆ ట్వీట్‌ను తొలగించారు. ఎన్నికల తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఒక కామెంట్ చేశారంటూ అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి సినిమాలు చేయడం వల్ల ఎవరికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. అంగీకరించిన అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని.. జనరల్ గా చేసిన వ్యాఖ్యలను ఆపాదించారంటూ పలువురు జనసైనికులు సామాజిక మాధ్యమాల్లో ఇలా స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ అల్లు అర్జున్ శిల్ప రవికి మద్దతుగా ప్రచారం చేయడానికి వెళ్ళినప్పటి నుంచి వీరి మధ్య వివాదం ఉంది. ఇది ప్రస్తుతం తారాస్థాయికి చేరుకొని కొనసాగుతోంది. ఇరువురి అభిమానుల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ఎప్పటికి కొలిక్కి వస్తుందో చూడాల్సి ఉంది.
డొనాల్డ్ ట్రంప్ | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్
చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చిట్కాలు