ఈవార్తలు, అమరావతి : ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రశ్నిస్తానన్న సీఎం చంద్రబాబుకు లేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్నారు. ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చిన తమ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తానన్న ఆందోళన చంద్రబాబులో ఉందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలు వివరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇక, అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో దానిపై జగన్ క్లారిటీ ఇచ్చారు.
మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం లాభం? అని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా ప్రయోజనం ఉండదని. అయితే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే మీడియా ముందుకు వచ్చి.. ప్రభుత్వాన్ని నిలదీస్తామని తేల్చిచెప్పారు. అటు.. డీజీపీపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంవైపు, న్యాయం వైపు నిలబడాల్సిన అధికారి.. పదవి వ్యామోహంలో దిగజారిపోయారని. రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని.
కాగా.. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ పలుమార్లు స్పీకర్‌ను కోరింది. అయినా, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరగ్గా.. ఒక్కసారి ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. మళ్లీ అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
ధోనీ టీం వల్లే న్యూజిలాండ్‌పై ఓటమి.. రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు
అమెరికా సెకండ్ లేడీ మన తెలుగమ్మాయే