తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ప్రయాణికుల ఆందోళన. ఉదయం ఈ ఘటన. సుమారు 45 మంది ప్రయాణికులు నిరసనను తెలియజేశారు. ఎయిర్ లైన్స్ విమాన సర్వీసు రద్దు చేయడంతో ఈ ప్రయాణికులంతా ఆందోళన చేపట్టినట్లు తెలిసింది. హైదరాబాదు నుంచి ఉదయం 7:15 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు విమానం వచ్చింది. తిరిగి ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాదు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్ చేయడంతో ఆఫ్లైట్‌లో వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తారో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలనుకున్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వేచి ఉండటంతో అసహనంతో ప్రయాణికులు అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఉన్నారు.
ఈ తరహా చర్యల వల్ల విమాన ప్రయాణికులు విలువైన సమయం వృధా కావడంతోపాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. తనకు అత్యవసర మీటింగ్ ఉందని, అకస్మాత్తుగా విమానం రద్దయిందని వెల్లడించారని ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదని ఒక ప్రయాణికుడు వాపోయాడు. తనలాంటి ఎంతో ఈ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సమయాన్ని వృధా చేయడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించిన ఎయిర్ లైన్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. కంపెనీ విమానాల శాఖకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ఎయిర్ లైన్స్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. విమాన ప్రయాణికులు అంటే కనీస గౌరవం లేకుండా పోయిందంటూ ఖచ్చితంగా ఉంది. ఆటోలో వాహనాలు నడిపే వారికి కూడా ముందుగా చెబుతారని, కానీ ఎయిర్ లైన్స్ సిబ్బంది అంతకంటే దారుణంగా వ్యవహరించారని పలువురు విమర్శలు గుప్పించారు.
నిరుద్యోగులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్ లో ఉచిత కోచింగ్
బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పండ్లు అస్సలు తినొద్దు