రాష్ట్రానికి శ్రీమంతులను ఆహ్వానించి గ్రామాలు, వార్డుల దత్తత చెందిన ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో తెచ్చిన స్మార్ట్ వార్డ్ స్మార్ట్ గ్రామాల కాన్సెప్ట్ ను మరింత మెరుగుపరిచి సొంత గడ్డను దత్తత తీసుకుని అభివృద్ధి కోసం వారి భాగస్వామ్యాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో దేశ విదేశాల్లోని అనేక రంగాల్లో ఉన్న ప్రముఖులు గ్రామ సేవ అభివృద్ధికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ దత్తత ప్రారంభించడం ద్వారా అనేక గ్రామాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టడానికి అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు అమలులో ఉన్న దత్తత తరువాత పునఃప్రారంభించేందుకు సన్నాహాలను ప్రభుత్వం చేస్తోంది. సొంత గడ్డకు మేలు చేయాలనే వారికి అవకాశం కల్పించే ఉద్దేశ్యంతోనే ఈ మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉద్యోగ, వ్యాపార పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలకు జన్మభూమికి సేవ చేసే కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది.
గ్రామాలను దత్త పుత్రికలుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో గతంలో 2017లో ఈ చిత్రాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చుట్టారు. సంసద్ ఆదర్శ గ్రామ పథకంలో రాష్ట్రంలోని ప్రతి ఊరు, వార్డును ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ఎన్నారైలు దత్తత తీసుకునేలా ప్రోత్సహించారు. అనేక ప్రముఖులు గ్రామాలు, వార్డులను ఎంపిక చేసుకొని పాఠశాలలు, ఇతర సౌకర్యాలు, రోడ్లు, ఆట స్థలాలు, ప్రార్థనా మందిరాలు, స్మశానాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకోవడంతో విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా తన సొంత గ్రామాభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చారు. అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక వేదిక కల్పించింది. అధికారులను నియమించి సహకారం అందించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చింది.
గ్రామాల అభివృద్ధికి సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించడానికి ప్రతి సంక్రాంతికి కూడా ప్రభుత్వం ప్రధానం చేసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ దత్తత కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయినట్లు కూటమి ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిని మరోసారి ప్రారంభించడం ద్వారా సొంత గ్రామాలకు మేలు చేసే ఆలోచనలో ఉన్నవారికి ఒక సౌకర్యాన్ని కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ప్రభుత్వం నిధులతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న గ్రామాలను కలిగి ఉన్న వారి ఆర్థిక సహాయాన్ని కూడా గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి దత్తత సమయంలో ప్రభుత్వం తెరపైకి వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల్లోనే నూతన మార్గదర్శకాలను విడుదల చేసి ఈ దత్తత ప్రోగ్రాంకు విస్తృత ప్రచారాన్ని కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేయబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహం
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి