ఏపీలో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం సరికొత్తగా అమలు చేసేందుకు స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో నూతన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రైతుల సమయం వృధా కాకుండా వాట్సప్ ద్వారా సేవలు అందించే ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది. ధాన్యం విక్రయించుకునేందుకు తమ వాట్సాప్ ద్వారా 73373 59375 నెంబర్ కు హాయ్ అనే మెసేజ్ పెడితే కొనుగోలు ప్రక్రియ ప్రారంభం. వాట్సాప్ సందేశం పంపగానే కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేయబడుతుంది. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసి ఆ తర్వాత పేరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ధాన్యం అమ్మిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాలి. ఆ తరువాత ధాన్యం అమ్ముకోవాలనుకుంటున్న తేదీలకు మూడు ఎంపికలు ఉంటాయి. వాటిలో ఒక తేదీని రైతు ఎంచుకోవాలి.
అలాగే సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆపై ఎటువంటి రకం దాన్యం అమ్మాలనుకుంటున్నారో ఆప్షన్ ఉంటుంది. ఆ తరువాత ఎన్ని బస్తాల ధాన్యం అమ్మదలిచారో నమోదు చేయాలి. దీనితో స్లాట్ బుక్ అయినట్లు ఒక ప్రత్యేక సందేశం ద్వారా షెడ్యూల్ అయిన కూపన్ కోడ్ వస్తుంది. ఆ తేదీ, ఎంచుకునే సమయంలో కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి రైతు సులభంగా ధాన్యం అమ్మవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద గంటలు తరబడి వేచి ఉండకుండా, ధాన్యం కొనుగోలుకు ఎవరిని బతిమాలకుండా రైతు ఈ ప్రక్రియ ద్వారా సులభంగా ధాన్యం అమ్ముకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సరళతరం చేసిందని మంత్రి చెబుతున్నారు.
ఈ విధానంతో రైతులకు కూడా మేలు కలుగుతుంది. ప్రస్తుతం మిల్లర్ల వద్దకు ధాన్యం తీసుకుని వెళుతున్నప్పుడు అక్కడ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి అక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే సమయంలో అక్కడ రైతుల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా ఇబ్బందులకు చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను సరళతరం చేసే అమలు కోసం సిద్ధమవుతోంది. కానీ ధాన్యం అమ్మకమైన తర్వాత డబ్బులను ఎన్ని రోజులు తర్వాత రైతులకు ఇస్తారు, ఏ విధానంలో పేమెంట్ చేస్తారు అనే విషయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమే ప్రస్తుతం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. ఒప్పందం కూడా ప్రభుత్వం స్వస్థతను అందించిన రైతులు కోరుతున్నారు.
ముంబై కా బాద్షా ఎవరు.? రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షం.!
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి