అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ పీఏసీ చైర్మన్ పదవి అంశంలో ప్రతిపక్ష వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పదవి జనసేనను వరించింది. పీఏసీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. తాజాగా అది తెరపడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పార్టీకి చెందిన పులవర్తి ఆంజనేయులు పేరును ప్రతిపాదించగా, ఆయనకే దాదాపు పదవి ఖాయమైంది. త్వరలోనే ఆయన పేరును లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా, పీఏసీ చైర్మన్ పదవి రావాలంటే కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ.. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవి జనసేన సొంతమైంది.
సీఎం రేవంత్ రెడ్డి మెడకు అదానీ కుంభకోణం వ్యవహారం..!
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి