ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్ మొత్తాలను నేరుగా కాలేజీ యాజమాన్యాలకే చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనూ ఇదే విధానం అమలైంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో కాలేజీ యాజమాన్యాలకు ఫీజులను చెల్లించకుండా విద్యార్థుల తల్లి ఎకౌంటుకు ఆయా ఫీజుల మొత్తాలను వైసీపీ ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాలను కాలేజీ యాజమాన్యాలకు నేరుగా విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్లి చెల్లించడం వల్ల.. విద్యార్థి స్థితిగతులను తెలుసుకునే అవకాశం ఉంటుందని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఏడాదికి నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సకాలంలో విడతలు వారీగా ఫీజులను ప్రభుత్వం విడుదల చేయగా విద్యార్థులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అనేక కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఫీజులను చెల్లించిన విద్యార్థులను చెల్లించి ఒత్తిడికి గురి చేశాయి. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించాలని అప్పట్లో ప్రభుత్వానికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ఎన్నికల్లో హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ మార్పు చేసి పాత ప్రక్రియ అమలులో ఉందని లోకేష్ చెప్పారు. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా ఫీజు రీంబర్సుమెంట్ విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్ ప్రస్తుతం అమలులో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక నేరుగా కాలేజీలకు ఫీజు చెల్లిస్తామని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు ఎంతో మేలు కలుగనుంది. 2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను కాలేజీ యాజమాన్యాలపై చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇది ఉపశమనం కలిగించే వార్తగా చెప్పవచ్చు. ఫీజు రియంబర్స్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే అనేక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ముక్కు పిండి మరియు ఫీజులను వసూలు చేశాయి. కొన్ని యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తేనే గాని పరీక్షలకు, ల్యాబ్ వర్కులకు కూడా అనుమతి లేదు. ఇలాంటి ఇబ్బందులతో తల్లిదండ్రులే అప్పులు చేసి మరి ఫీజులను చెల్లించారు. ఈ పరిస్థితుల్లో సాంఘిక సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వమే కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థుల ఫీజులను చెల్లిస్తుంది. ఇకపై కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండదు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. తాజా నిర్ణయంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ లో ఇద్దరిని చంపిన మావోయిస్టులు.. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి
పరగడుపున ఈ పండ్లను అస్సలు తినొద్దు