గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడంలో కీలకంగా వ్యవహరించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి.. ఎవరికి వారు అన్నట్టుగా రాజకీయాలను కొనసాగించారు. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బలంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలంటే వేరువేరుగా పోటీ చేయడం వల్ల సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ భావించారు. ఆ ఉద్దేశంతోనే తాను రెండు మెట్లు దిగి కూటమి ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఏపీలో కూటమి వెనుక పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో సాగించిన కృషి దాగి ఉంది అని చెప్పవచ్చు. ఆయన కోరిక వల్లే ఏపీలో కూటమి మీద పోటీ చేసి వైసీపీని అధికారం నుంచి దించగలరు. 151 స్థానాలు ఉన్న వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదేమో. అటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఇప్పుడే కాదు మరో దశాబ్ద కాలంపాటు చంద్రబాబునాయుడు సీఎంగా ఉండాలంటూ. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అర్థం కాక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో దాదాపు 90 శాతం మంది ఆయనను సీఎం చేయాలనుకుంటున్నారు. గడిచిన ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయనే తాను సీఎం కాను అంటూ తేల్చి చెప్పారు. అయితే 2024 ఎన్నికల్లో విజయం సాధించి ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్.. 2029 ఎన్నికల్లో మాత్రం సీఎం అవుతారు అంటూ ఆయన అభిమానులు, కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశారని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను సీఎం స్థానంలో చూడాలి అన్నది ఎంతోమంది అభిమానుల కల. అయితే ఆకల ఇప్పుడు నెరవేరే అవకాశం లేదు
ఇప్పటికే పవన్ కళ్యాణ్ వయసు 60 ఏళ్లు పైమాటే. ఇప్పుడే కాకుండా మరో దశాబ్దంపాటు అంటే సుమారు 15 ఏళ్లపాటు చంద్రబాబునాయుడు సీఎం గారు ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆకాంక్షల మేరకు చంద్రబాబునాయుడు సీఎం అయితే.. పవన్ కళ్యాణ్ వయసు సుమారు 75 ఏళ్ల వయసు దాటుతుంది. ఆ వయసులో కళ్యాణ్ రాజకీయాలు ఏ స్థాయిలో పవన్ చేయగలరో ఎవరికీ తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిని కనీసం అంచనా వేయకుండా పవన్ కళ్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు అంటూ ఆయన అభిమానులతోపాటు జనసేన కార్యకర్తలు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యంతో కొనసాగుతున్నారనే విషయం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరంగా ఉంచడమే పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. జగన్ ను అధికారానికి దూరంగా ఉంచాలి అంటే తాము కలిసి ఉండాలన్న ఏకైక సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విడిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేమన్న భావన పవన్ కళ్యాణ్ లో ఉండవచ్చు అని.. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మరికొన్నాళ్లపాటు ఇలా కలిసి ఉండే ప్రతిపాదనలను ముందుగానే చంద్రబాబు వద్ద పెడుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల క్షేత్రస్థాయిలో పనిచేసే ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒంటరిగా పార్టీని ప్రోత్సహించే అవకాశం పవన్ కళ్యాణ్ ముందుగానే ఈ తరహా చేయడం వల్ల తెలుగుదేశం లోకువ అవకాశం ఉందని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్ గానే పరిగణించాల్సి ఉంటుందో.? లేదా అన్న భవిష్యత్ ఉంటుంది.
[09:26, 11/23/2024] బిఎస్ నాయుడు: ఎ
జగన్ వర్సెస్ షర్మిల.. అంశమేదైనా జగన్ పై విరుచుకుపడుతున్న సోదరి
పరగడుపున ఈ పండ్లను అస్సలు తినొద్దు