OverdriveNTool is a software application https://bittention.com/programs/overdriventool/ designed for AMD Radeon GPUs. It lets users tweak core clock speed, memory frequency, voltage settings, fan speeds, and power constraints on their graphics cards.

Advanced programs designed to fine-tune the GPU encourage all users of the computers to pick and use one of the most suitable programs. MorePowerTool https://getpc.top/programs/morepowertool/ is renowned for its extraordinary features to increase the frequency of the processor, reduce power consumption, and perform other important actions.

Микрокредит с плохой кредитной историей в Казахстане https://mikrokredity-online.kz/loans/mikrokredit-s-plohoj-kreditnoj-istoriej— это возможность для людей с негативным кредитным прошлым получить небольшую сумму денег в долг. Многие микрофинансовые организации (МФО) в стране готовы рассмотреть заявки от клиентов с испорченной кредитной историей, так как они в первую очередь ориентируются на текущую платежеспособность заемщика.

Home ఆంధ్రప్రదేశ్ మండలిపై కూటమి ఫోకస్.. చేజారే నేతలపై వైసీపీ కన్ను, ఇక మిగిలేది ఎందరో.! – Swen Daily

మండలిపై కూటమి ఫోకస్.. చేజారే నేతలపై వైసీపీ కన్ను, ఇక మిగిలేది ఎందరో.! – Swen Daily

by Admin_swen
0 comments
మండలిపై కూటమి ఫోకస్.. చేజారే నేతలపై వైసీపీ కన్ను, ఇక మిగిలేది ఎందరో.!


గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత వైసిపి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేని రీతిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి తీవ్ర అగాధంలో కూరుకుపోయిన వైసీపీని.. కోలుకోనీయకుండా రాష్ట్రంలో కూటమి సర్కార్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఈ దాడులపై పోరాటానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ దాడులు తగ్గుముఖం పట్టాయి అంటున్న తరుణంలో కీలక నేతలను వివిధ కేసుల పేరుతో కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. దీంతో చాలామంది నాయకులు బయట మాట్లాడేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉ వైసీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ అసమర్ధతను, హామీలను విస్మరించిన తీరును ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల కార్యకర్తలను వరుసగా అరెస్టు చేస్తూ వస్తున్నారు. ఇది కూడా వైసిపిని మరింత డిఫెన్స్ లోకి నెట్టింది. మరోవైపు గడిచిన కొన్నాళ్లుగా వైసీపీకి బలమైన సపోర్టర్స్‌గా వస్తున్న సినిమా రంగానికి చెందిన వారిని కూడా కూటమి ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేసింది. సినీ నటుడు అలీ, పోసాని కృష్ణ మురళి, శ్రీ రెడ్డి వంటి వారంతా రాజకీయాలకు దూరంగా ఉంటామంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఒకవైపు రాజకీయంగా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న కూటమి వైసీపీని మరింత దెబ్బ కొట్టేలా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.

ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి పెద్దగా బలం లేదు. దీంతో వైసిపి అసెంబ్లీ సమావేశాలకు రావడమే మానేసింది. మండలిలో వైసీపీ బలంగా ఉండటంతో ఇక్కడ సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే, మండలిలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బ కొట్టే ప్రయత్నాలను కూటమి చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు వైసీపీని వీడి కూటమి పార్టీలలో చేరిపోగా, మరి కొందరు కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీనీ టెన్షన్‌కు గురిచేస్తోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది పార్టీని వెడతారో తెలియని పరిస్థితి ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇప్పటికే వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. తాజాగా ఏలూరు జిల్లాకు చెందిన జయ మంగళ వెంకటరమణ కూడా వైసిపికి గుడ్ బై చెప్పేసారు. ఎమ్మెల్సీ పదవికి పార్టీకి సభ్యత్వానికి జయ మంగళ రాజీనామా చేశారు. ప్రస్తుత శాసన మండలిలో టిడిపికి పదిమంది ఎమ్మెల్సీలు ఉండగా, వైసీపీకి 37 మంది ఉన్నారు. శాసనమండలిలో సంఖ్యాబలం పూర్తిగా వైసీపీకి ఉంది. అసెంబ్లీలో బలం లేకపోయినా శాసనమండలిలో ఉన్న బలం ద్వారా ఓటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని వైసిపి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కూటమి నేతలు ఎమ్మెల్సీలపై దృష్టి సారించి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమినేతలు చేస్తున్న ప్రయత్నాలతోనే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు డొక్కా మాణిక్య వరప్రసాద్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సి రామచంద్రయ్య రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత రాజీనామా చేయగా, తాజాగా జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.

వైసీపీని వీడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న నేతల జాబితాలో పేర్లు ఉన్నాయి. వీరు పార్టీ వేడకుండా ఉండేలా పార్టీ అధిష్టానం తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతోంది. పార్టీ వీడుతారని వారి జాబితాలో పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, జఖియా ఖానం పేర్లు వినిపిస్తున్నాయి. రఘురాజు అనర్హత వ్యవహారం తేలిన తరువాత పార్టీ మార్పుపై వీరు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరితోపాటు మరికొంతమంది కూడా పార్టీ మారతారన్న ప్రచారము జరుగుతోంది. పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్న నేతలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఉంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్న నాయకులతో మంతనాలను ముఖ్య నాయకులు జరుపుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం మండలిలో ఉన్న తన బలాన్ని నిలుపుకుంటుందో.. లేదో చూడాల్సి ఉంది.

పిఎఫ్‌దారుల బిగ్ అలర్ట్.. ఖాతాదారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం
ఈ ఆహార పదార్థాలను అస్సలు కలిపి తినకూడదు

You may also like

Leave a Comment

Swendaily.com delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech