ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు (పేటీఎం) రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వ నివేదికతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 44,303 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే రోజున మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్స్ ను పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ సమావేశాల్లో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కలిపి దాదాపు 1.2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించే పిటిఎంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొనగా మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచులు కార్పొరేటర్లు వార్డు సభ్యులు వారి పరిధిలోని పాఠశాలలో పాల్గొనాలని పాఠశాల విద్యాశాఖ ఆహ్వానాలు శనివారం ఉదయం 10.20 గంటలకు బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెరిప్యాడ్ వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ నుంచి మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేటీఎంలో పాల్గొంటారు. 1.40 గంటలకు ఉండవల్లికి ప్రయాణమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును ప్రత్యేక ఉద్దేశంతో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో భాగంగా అనేక చోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు పురుషులకు పోటీలో నిర్వహిస్తున్న అనంతరం తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ తరగతి గదిలో సమావేశమై ఎప్పటి వరకు నిర్వహించిన ఎఫ్ఈ -1, 2 పరీక్షల మార్కుల వివరాలతో కూడిన ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తారు. అన్ని తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి బోధనకు సంబంధించి సూచనలు తీసుకుంటూ ఆ తరువాత విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు భోజనం ఏర్పాటు చేశారు. చేస్తారు.
మత్తు పదార్థాలపై అవగాహన..
ఇదే సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఈగల్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు వినియోగించుకోనున్నారు. మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం బిగించిన ఈగల్ పాఠశాలలో చైతన్యమే డ్రగ్స్ వద్దు బ్రో విద్యార్థుల శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో గంజాయి, డ్రగ్స్, వైట్నర్ తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలంటూ చైతన్యం తీసుకురానున్నారు. మత్తుకు బానిసైతే అన్నీ కోల్పోతారని, అమ్మానాన్నలపై చిరాకుపడతారని, స్నేహితులు దూరమవుతారని, బంధువులు ఇళ్ళకు రానివ్వరని, చదవలేరని, రాయలేరనే విషయాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారన్నారు. అన్ని విధాలుగా విద్యార్థులు చితికి పోతారు. ప్రభుత్వం పుస్తకాలు, బ్యాగులు, బూట్లు ఇస్తోంది. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం పెడుతోంది. చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి, మత్తుకు సంబంధించిన ఎవరైనా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళకో, టీచర్లకు చెప్పండి. డ్రగ్స్ వద్దు బ్రో అని బడిలో వీధిలో, ఊర్లో గట్టిగా అరవండి అని విద్యార్థులకు వివరించడంతోపాటు దీనికి సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తారు. మంత్రి లోకేష్ ఈ సహకారంతో ఈ సందర్భంగా చేపడుతున్నామని అధిపతి ఆకే రవికృష్ణ తెలిపారు.
Daily Horoscope | ఈ రోజు రాశిఫలాలు 07 ఏప్రిల్ 2024
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి