ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కేంద్రీకృతమై కొనసాగుతోంది. ఇది బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం బుధవారం నాటికి తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరుకుంటోందని వాతావరణ శాఖ. దీని ప్రభావంతో బుధవారం, గురువారాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది. అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ కోరనే ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే, అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణ, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ జిల్లాలో అనేక వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే, బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైయస్సార్ జిల్లాలో కొన్నిచోట్ల తెలుగు పార్టీలు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే గురువారం తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, వైయస్సార్, శ్రీ సత్య సాయి జిల్లాలో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకినాడ, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాలో కొన్నిచోట్ల తెలుగు పాట నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.
యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మార్పులు.. ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంక్
జుట్టు పెరగడానికి చిట్కాలు | జుట్టుకు ఈ ఫుడ్స్ మీ ఆహారంలో పెరగనివ్వండి