ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి వెంకన్న స్వామి కోట్లలో భక్తులు ఉన్నారు. ఏటా కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏటేటా స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తిరుమల పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు టీటీడీ దూర దృష్టితో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రపంచానికి ఆధ్యాత్మికపరంగా రోల్ మోడల్ లా తిరుమలను అభివృద్ధి చేయడానికి నడుం కట్టింది. స్వర్ణాంధ్ర విజన్ – 2047 స్ఫూర్తితో తిరుమల విజన్-2047ను ప్రారంభించింది. తిరుమలలో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించేలా వ్యూహాత్మక ప్రణాళికను రూపొందిస్తోంది.
ఆ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనలు ఆర్ఎఫ్‌పి (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ను విడుదల చేసింది. తిరుమల అభివృద్ధిలో సంప్రదాయాన్ని, ఆధునికతను మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు టిటిడి అధికారులకు సూచించారు. ఆధ్యాత్మిక పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందు చూపుతో భక్తులకు సౌకర్యాలు, వసతి సౌకర్యాల కోసం ఆయన అందుబాటులో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టిసారించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. తిరుమల విజన్-2047 లక్ష్యాలను చేరుకునేందుకు పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానించింది. ఇప్పటికే తిరుమల పట్టణ అభివృద్ధిపై ప్రణాళికను సిద్ధం చేసిన టీటీడీ మూడు వారాల్లో ఆసక్తి కలిగిన ముందస్తు అనుభవం ఉన్న ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కోరింది.
విజన్-2047 పేరుతో టిటిడి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలలో ఆధునిక పట్టణ ప్రణాళికలు చేయడం, తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాలను అమలు చేయడం, వారసత్వ పరిరక్షణ పర్యావరణానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రపంచంలో తిరుమలను రోల్ మోడల్‌గా రూపొందించడానికి ప్రయత్నించడం, అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయడం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జోన్ల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం, తిరుమలలో పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడం, ప్రాముఖ్యత కలిగిన మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలను తయారు చేయడం వంటి అంశాలను లక్ష్యాలుగా నిర్దేశించుకున్నట్లు. వీటి అమలు కోసం ప్రత్యేకంగా టీటీడీ దృష్టి సారిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు చిక్కులు తప్పినట్టే.. హైబ్రిడ్ మోడల్ కు పాక్ ఒకే.!
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..