ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. 24 గంటల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేరుగా రైతుల ఖాతాలోనే ఈ డబ్బులు జమ అయ్యేలా చూడాలని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే అకౌంట్‌లో డబ్బులు వెచ్చించినట్లు ప్రభుత్వ పెద్దలు పరిశీలించారు. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడ తప్పు జరగడానికి వీలులేదని చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. కోసిన గడ్డిని బయోపిక్ లోయల్ ప్లాంట్ వాళ్ళు తీసుకుంటే మరో రూ.5000 వరకు రైతులకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం లభించడంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులకు మరింత ఆదాయం సమకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాగు చేస్తున్న పొలాన్ని బట్టి రైతుకు దిగుబడి ఎంత వస్తుందో కూడా నమోదు చేస్తే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అనంతరం ధాన్యం తేమశాతాన్ని ఎలా గనిస్తారో కూడా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తేమ శాతంలో ఖచ్చితంగా ఉండాలని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయంలో యాంత్రికరణ మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. యాంత్రికరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడి తగ్గించి రైతులను అప్పులు ఊపిరి నుంచి బయటికి తీసుకొచ్చి ఉపశమనం కలిగించే చర్యలను ప్రోత్సహించాలని, ఇది రైతుల ఆదాయాన్ని మరింతగా పెంచుతున్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఒక్కరోజు ముందుగానే డబ్బులు చెల్లించడం వల్ల వారు మరింత ఆనందంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి రైతుకు ఈ మొత్తం చెల్లించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం జారీ చేసింది.
WINTER SOLSTICE : నేడు 8 గంటలు వెలుతురు.. ఖగోళంలో కొత్త వింత..
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..