పుష్ప-2 ప్రీమియర్ షో రోజు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసిలాట వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఈ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయగా జైలు జీవితాన్ని కూడా గడపాల్సి వచ్చింది. బెయిల్ రావడంతో మరుసటి రోజే అల్లు అర్జున్ విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను సినీ రంగానికి చెందిన ప్రముఖులు పరామర్శించారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం చేశారంటూ సినీ ప్రముఖులు వెళ్లి పరామర్శించారంటూ అసహనాన్ని వెళ్ళగక్కారు. అల్లు అర్జున్ దే తప్పు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలను ఖండించేందుకు అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తనది తప్పు కాదంటూ అల్లు అర్జున్ వైపే తప్పుగా కనిపించింది. అసలు అక్కడ తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన విషయం తనకు తెలియదు అన్నట్లుగా అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏసీబీ విష్ణుమూర్తి ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని మాట్లాడి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మంచిది కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఉంటున్నారంటూ.ఇష్టం వచ్చినట్లు కట్ చేస్తామంటూ తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. ఎక్కడితో ఆగకుండా పోలీసులు అల్లు అర్జున్ నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే అంటూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఆరోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన వ్యవహారానికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేయడంతో ఈ వివాదం మరింతగా పెరిగింది
6