ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై పోరుకు వైసిపి సిద్ధమవుతోంది. కోటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలకు జగన్ మోహన్ రెడ్డి. ఈనెల 27వ తేదీన, వచ్చే నెల మూడో తేదీన ఆందోళనలో నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రైతాంగ సమస్యలపై ఒక నిరసనగా వైసిపి నిర్వహించారు. వచ్చే నెల మూడో తేదీన విద్యార్థుల సమస్యలపై జగన్ నిరసనలకు. వరుసగా ప్రజా సమస్యలపై పోరాటాలకు వైసిపి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు గడిచి ఆరు నెలలు కాకముందే వైసిపి కార్యకర్తలు, నాయకులను రోడ్లపైకి వెళ్ళమనడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలకు అధికారాలు లేకుండా చేయడంతో పాటు ఆర్థికంగానూ నష్టపోయేలా జగన్మోహన్ రెడ్డి చేశారన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా నష్టపోయి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకోవడం పట్ల వారంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ తరహా నిరసన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులను నాయకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో నిరసనగా నిర్వహించాలంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం ఆ పార్టీ నాయకులు. ఈ కోణంలోనే జగన్ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఒక్కోసారి నిర్వహించాలంటే కనీసం కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఈ ఆయా జిల్లాలో భరించే నాయకులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించే ముందు పార్టీ నాయకుల ఆలోచనలు తెలుసుకోవడంతో పాటు సలహాలను పాటించాలని సూచిస్తున్నారు.
ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన నాయకులు, కార్యకర్తలు మరింత ఇబ్బందులకు గురయ్యేలా ఈ కార్యక్రమాలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయడం పట్ల క్యాడర్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్థికంగా భారాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. తాడేపల్లి లో జగన్ మోహన్ రెడ్డికి ఇలాంటి పిలుపులు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే వారు ఇబ్బందులు పడుతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. క్యాడర్‌కు ఇబ్బందులు కలుగకుండా దూరంగా ఉండాలని చూస్తున్నారు. కనీసం ఏడాదిపాటు ఈ ప్రభుత్వానికి సమయాన్ని ఇవ్వడం ద్వారా ప్రజల వైఫల్యాలను గుర్తించి రోడ్లపైకి వస్తారని, అప్పుడు దానిని క్యాష్ చేసుకునేందుకు వైసిపి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరు గడవక ముందే రోడ్లపైకి నాయకులు కార్యకర్తలు రావడం వల్ల ఆర్థికంగా భారం కలగడంతోపాటు.. ప్రజల్లో కూడా ఒక రకమైన భావన ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
టీటీడీ సమాచారం ఇకపై సులభతరం.. అక్కడకి టీటీడీ చాట్ బాట్
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..