సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు మంగళవారం విచారణకు హాజరయ్యారు. సోమవారం ఈ మేరకు పోలీసులు అల్లు అర్జున్ కు సమాచారం అందించారు. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ అల్లు అర్జున్ కు ఇచ్చారు. పోలీసుల సమాచారం మేరకు అల్లు అర్జున్ 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. మూడున్నర గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాయి. పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం రాత్రి ఆయన తన లాయర్లతో సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఆయన చేరుకున్నారు. అల్లు అర్జున్ కు స్టేషన్ లోకి వచ్చిన వెంటనే పోలీసులు 18 ప్రశ్నలతో ఒక పేపర్ ను ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆపరేషన్లకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు అడిగినట్లు చెబుతున్నారు. రాతపూర్వకంగా ఇవ్వాల్సిన ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాధానం ఇచ్చారు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తి చూపారు. ఆ తర్వాత కూడా ప్రశ్నలను పోలీసులు సంధించినట్లు చెబుతున్నారు.
అల్లు అర్జున్ విచారణకు వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పెద్ద ఎత్తున బందోబస్తును మోహరించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అన్నదానిపై ఆసక్తి చూపారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలను పరివేక్షిస్తున్న న్యాయాన్ని మాత్రం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు.
వరుస అల్పపీడనాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి.. సెప్టెంబర్ 26 న మరో అల్పపీడనం
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..