కేంద్ర ప్రభుత్వం ఏపీకి శుభవార్తను అందించింది. ఆర్థిక సంఘం గ్రాంట్ నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడత బకాయిల కింద రూ.25 కోట్లు, రెండో విడతలో రూ.421 కోట్లను ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ మేరకు రూ.446 కోట్ల నిధులను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రెండో వాయిదా కింద రూ.421 కోట్లతోపాటు తొలి వాయిదా కింద పెండింగ్లో ఉన్న రూ.25 కోట్లను కూడా కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రంలోని 13,097 పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఈ గ్రాంట్ నిధులను కేటాయించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలలో ప్రభుత్వం ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు దృష్టి సారించింది. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి భారీగా నిధులు అందుతాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అక్టోబర్ నెలలో తొలి విడత నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అన్ టైడ్ గ్రాంట్స్ కింద రూ.395 కోట్లు, టైడ్ గ్రాంట్స్ కింద రూ.593.26 కోట్లు విడుదల చేసింది. తొలి విడతలో ఏపీకి కేటాయించిన నిధులలో రూ.25 కోట్లు పెండింగ్లో ఉంచారు. రాష్ట్రంలో 12,583 గ్రామ పంచాయతీలు, 615 మండల పంచాయతీలకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లో పొందుపరిచిన అంశాల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. వీటిలో టైడ్ గ్రాంట్స్ ఓడిఎఫ్, పారిశుధ్యం, నీటి యాజమాన్యం, వాననీటి సంరక్షణ, మురుగునీటి రీసైక్లింగ్, ఇళ్ల నుంచి విడుదలైన వ్యర్ధాల శుద్ధికి వినియోగించాల్సి ఉంటుంది.
అన్ టైడ్ గ్రాంట్స్ ను పారిశుధ్యం, విద్య, వ్యవసాయం, గ్రామాల్లో గృహ నిర్మాణం వంటి పనులు వినియోగించాల్సి ఉంటుంది. స్థానిక అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగించాలి. అంతేకానీ ప్రభుత్వం వీటిని ఉద్యోగుల జీత, భత్యాలు, ప్రభుత్వ ఇతర ఖర్చుల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దారి మళ్లించకూడదు. తాజాగా రెండో ఇచ్చిన విడత గ్రాంట్ నిధులు పవన్ కళ్యాణ్ కు సంబంధించిన శాఖలకు చెందిన ఆయన చొప్పుననే గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ మొత్తాలను వెచ్చించే అవకాశం ఉంది. ఇప్పటికే అవసరాలు, ఇతర అవసరాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ మొత్తాలను పవన్ కళ్యాణ్ వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయడంతో కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణాలను పెద్ద ఎత్తున పూర్తి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసేటప్పటికి పెద్ద ఎత్తున చేపట్టారు. కొద్దిరోజులు కిందట సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగకు ముందే ఈ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పండగకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎవరైనా రోడ్లు బాగాలేదని ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడితే దానికి సంబంధించిన ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందుగానే ఎమ్మెల్యేలు ఈ పనులు జోరుగా జరుగుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు.. ఫిబ్రవరి 19 నుంచి మ్యాచులు ప్రారంభం
బాలీవుడ్ స్టార్లలో అత్యంత సంపన్నులు ఎవరంటే..