ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఖరారు అయింది. 31న నరసారావు పేట మండలం యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అనంతరం ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో యలమంద వద్ద సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. పల్నాడు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేయబడ్డాయి సాధారణంగా అయితే ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలి. అయితే నూతన సంవత్సర వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పులిపాడు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు అన్న ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.. జనవరి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరోచోట జరుగుతుందని ప్రచారం జరిగింది.
పులిపాడు గ్రామంలో కాకుండా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం అన్నారంలో సీఎం పర్యటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే నరసారావు పేట నియోజక వర్గానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి ఇదే ఆలోచన నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయాలన్న నాయకులు అక్కడకి మార్చారనేది ప్రచారం. గ్రామ సభతోపాటు పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు భావించారు. గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో మళ్లీ మరో మార్పు జరిగింది. తాజాగా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని, అక్కడే పెన్షన్లు పంపిణీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ఒకటో తేదీని కాకుండా పెన్షన్ల పంపిణీ డిసెంబర్ 31 ఉదయాన్నే పూర్తి చేయాలని ఆలోచనతో అటు సీఎం కార్యాలయం, టిడిపి నాయకులు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ యలమంద గ్రామంలో ఉన్నారు. అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలంతోపాటు సభా వేదిక ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు నాయకులు. అందుకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు ఈ గ్రామానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం రాకకు సంబంధించిన షెడ్యూల్ విడుదల సీఎం.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
డిసెంబర్లో ప్రకృతి ప్రసాదించే పండ్లు, కూరగాయలు ఇవే..