రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేలా కనిపించడం లేదు. కొత్త విద్యా సంవత్సరంలో బరులు తెరిచే నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి వారంతా వీధుల్లో చేరేలా కూటమి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం డీఎస్సీ విడుదలకు సంబంధించిన ప్రక్రియను కూటమి నేతలు అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, భర్తీ పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమీషన్ నివేదిక సమర్పించిన తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగుతుంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలో నిర్వహిస్తున్నామని, కొరత అనే మాట లేకుండా కోటిన ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అందులో భాగంగానే మొత్తం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారు. ఆ వెంటనే జూలై ఒకటో తేదీన డిఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏటా వేసవి సెలవులు అనంతరం జూన్ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ ఐదు నెలల లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తి చేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వబడిన అభ్యర్థులు కోరారని, ఆమెరకు మూడు నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రదర్శించారు. అక్టోబర్ 6న డీఎస్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పూర్తి చేసింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్‌కు మరోసారి బ్రేక్ పడింది. వర్గీకరణ సిఫార్సుల కోసం ఏక సభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం మూడు నెలల్లో సమర్పించాలని ఆదేశించింది.
ఈ కమీషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించిన తరువాత కనీసం మరో రెండు నెలలు సమయం పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భక్తి ప్రక్రియ పూర్తి కావడం సాధ్యం కాదు అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తికాలేదు. అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ కావడంతో మరింత సమయం అవసరమని చెబుతున్నారు. అయితే నిరుద్యోగులు మాత్రం ఈ ప్రక్రియ ఎప్పటికి ప్రారంభం అవుతుందా అన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ టెట్ నిర్వహించిన కనీసం నాలుగు లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో ఆశావహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మెగాడీఎస్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని వారంతా ఆతృతగా ఉన్నారు. కానీ వివిధ కారణాలతో డీఎస్సీ వాయిదా పడుతూ వస్తోంది. బడుల్లో టీచర్ల సంఖ్యను తగ్గించేలా గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొత్త ఉపాధ్యాయుల అవసరం పెరగనుంది. ఆదర్శ, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలల్లోనూ అదనపు టీచర్లను ప్రభుత్వం అందిస్తున్నట్లు కనిపిస్తోంది.
సంక్రాంతి పండగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. 2,400 ప్రత్యేక బస్సులు
2025లో థియేటర్లలో రాబోయే తెలుగు మూవీస్ ఇవే!