ఏపీలో వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేసేందుకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా ఉచితంగా అందించిన వైద్య సేవలకు సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు సంబంధించి సుమారు మూడువేల కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ మతాలను చెల్లించే వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ యాజమాన్యం నిర్ణయించింది. తక్షణమే రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకుంటే వచ్చే నెల ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లేఖ రాసింది. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా చెల్లించడమే దుస్థితిలో ఉన్నామంటూ అసోసియేషన్ వాపోతోంది.
ఈ గత మూడు నెలల్లో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందని, ఈ నేపథ్యంలోనే సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తక్షణమే 2000 కోట్ల రూపాయలను చెల్లించడంతోపాటు మిగిలిన బిల్లులను నిర్దిష్ట కాల పరిమితుల్లోపు చెల్లిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి స్పందనను ఇప్పటి వరకు తెలియజేయలేదు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు కొన్ని వేలమంది ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు. ఆస్పత్రులు సమ్మెలోకి వెళితే మాత్రం వీరంతా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆసుపత్రిలో యాజమాన్యాలతో చర్చించాలని కోరుతున్నారు. లేకపోతే వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉన్న రోగులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరి చూసేందుకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.
నూతన సంవత్సర వేడుకలు వేళ.. హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు
గుండె లేని జీవ రాశులు ఇవే..