ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక ఉపయోగం కోసం సిద్ధం అయింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పథకంలో కీలక మార్పులను ప్రభుత్వం చేసింది. జూనియర్ కాలేజీలకు ఈ వసతి వర్తింపజేసింది. అందులో భాగంగానే డొక్కా సీతమ్మ మధ్యహన భోజన పథకం పేరుతో ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శనివారం నుంచి ఈ పథకం ప్రారంభం. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని ఈ నివేదన లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48 లక్షల మంది ఈ పథకం వల్ల లబ్ధి పొందనున్నారు. ఈ పథకంలో భాగంగా 398 కాలేజీలను సమీపంలోని పాఠశాలలకు అనుసంధానం చేశారు. ఆయా పాఠశాలల్లో భోజనం తయారు చేసి కాలేజీలకు పంపిస్తారు. మిగిలిన 77 కాలేజీలను సెంట్రలైజ్డ్ కిచెన్లకు అనుసంధానించారు. ప్రస్తుత ప్రభుత్వ విద్యా సంవత్సరంలో మిగిలిన కాలానికి.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో రూ.85.84 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
కాలేజీల్లోనూ మధ్యాహ్నం పథకం వల్ల విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులపై ప్రభావం పడింది. కొన్ని కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందరూ బాగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్ విద్యలో సంస్కరణలో ప్రారంభించారు. విద్యార్థులను విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా విద్యార్థులకు ఉచితంగా పార్టీ పుస్తకాలు నోట్ బ్యాగులు పంపిణీ చేసింది. మధ్యాహ్న భోజన పథకం లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ గృహాన్ని తిరిగి అమల్లోకి తీసుకువస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభించారు. ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అందించింది.
నేడు రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ క్యాబినెట్. కీలక నిర్ణయాలు ఉండేనా.?
ఖాళీ కడుపుతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో తెలుసా..