తిరుపతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా దారుణం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రమాదవశాత్తు ఆరుగురు మృతి చెందారు. ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు మృతులకు సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అయితే ఈ ఘటనపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల అసమర్ధత కూడా ఈ ప్రమాదానికి కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఈ ప్రమాదాన్ని కూడా వైసిపిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవిని కూడా కూటమికి చెందిన నేతతోనే భర్తీ చేయించారు. ఇక్కడ అనేక సంస్కరణలను చేపడుతున్నట్లు గతంలోనే ప్రచురించబడింది.
కానీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా ఈ ప్రమాదానికి గత వైసిపి తీసుకొచ్చిన విధానాలే కారణమంటూ వ్యాఖ్యానించడం ప్రస్తుతం అనేక ప్రశ్నలకు, సమస్యలకు తావిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ టోకెన్ల విధానం తీసుకొచ్చారని, వైకుంఠ ఏకాదశికి పది రోజులు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఈ తరహా విమర్శలను పలువురు నేతలు కూడా చేస్తున్నారు. తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాటను వైసీపీపై రుద్దే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడో వైసిపి తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన తొక్కిసలాటకు లింకు పెట్టడంపై అసహనం వెళ్లి వెతుకుతుంది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను మారుస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం మరి జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రవేశపెట్టిన ఈ విధానం తప్పు అని నిరూపిస్తే ఎందుకు మార్చలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే జగన్మోహన్ రెడ్డిపై పెడుతూ ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజులు పాటు చేయడం వల్ల ఎక్కువమంది భక్తులకు స్వామివారిని దర్శించుకునే జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఒకవేళ అన్ని రోజులు కాకుండా తక్కువ రోజులు ఇస్తే.. జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ భక్తులకు వెంకటేశ్వర స్వామిని దూరం చేసేందుకే ఇలా చేస్తున్నారు అంటూ విమర్శలు చేసే వారు. అంతెందుకు ఇప్పుడు చోటు చేసుకున్న ఘటన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగితే ఏ స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు కాబట్టే తిరుపతి నిర్లక్ష్యం చేస్తూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకునేలా చేస్తున్నాడన్న ఆరోపణలను పెద్ద ఎత్తున చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్ కూడా చేసేవారు.
కానీ ఈ ఘటనకు ప్రభుత్వంలో పెద్దలు ఎవరు బాధ్యత వహించడం లేదు. అంతెందుకు మొన్నటికి మొన్న లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందంటూ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన ఈ నాయకులు.. ఇంత ఘోరం ఎందుకు జరిగినట్లు ఆ స్థాయిలో స్పందించలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందూ పెద్దలు, ధార్మిక సంఘాలు ఈ ఘటనకు సంబంధించి ఎందుకు నోరు విప్పడం లేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తప్పు ఎవరు చేసిన తప్పు అని వేలెత్తి చూపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కూటమి దాటిపోతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైనే ఆరోపణలు చేయడం వల్ల ప్రభుత్వం చులకన కావడం తప్ప ప్రయోజనం ఉండదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఇబ్బందులు ఉంటే దానికి కారణం జగన్ అనే విధంగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా టీటీడీ విషయంలోనూ అదే జరుగుతుండడం. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకున్న ఈ ప్రమాద ఘటనలో అధికారులను బాధ్యులను చేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు దీనికి బాధ్యత వహించరా.? టీటీడీ చైర్మన్ ఈ విషయంలో తన బాధ్యత రాహిత్యాన్ని ఒప్పుకోరా ? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీటీడీలో సంస్కరణలను ప్రారంభించాలని, మరింత మంది భక్తులకు మేలు చేసే నిర్ణయాలను నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించి వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలి తప్ప.. ఇబ్బంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పై నెపాన్ని నెట్టడం ద్వారా ప్రయోజనం ఉండాలనే పరిశీలన గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మరి చూడాలని ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని లక్షలాదిమంది భక్తులు వస్తారని తెలుసుకోవడం కౌంటర్ల వద్ద ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని సమాచారం. తొక్కిసలాట ఘటనకు టీటీడీ అధికారులు, చైర్మన్, కలెక్టర్, ఎస్పీతోపాటు చంద్రబాబు కూడా బాధ్యుడని స్పష్టం చేశారు. పోలీసులంతా కుప్పం పర్యటనలో ఉండటం వల్లే తిరుపతిలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, గాయపడిన వారికి 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంక్రాంతి ప్రత్యేక రైలు సేవలు నేటి నుంచే.. 6432 ప్రత్యేక బస్సులు
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు