సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి హైదరాబాదులో ఉంటున్న ఏపీతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున బయలుదేరి వెళుతున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతుండగా, తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది ప్రయాణికులతో ఆయా కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లో ఇసుక వేసిన రాలనంతగా జనంతో కిక్కిరిసి ఉన్నాయి. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ప్రయాణికులతో హైదరాబాదులోని రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్సులు, రైలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం మొదలైన ఈ రెడ్డి శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవు కావడంతో మరింత పెరగనుంది. పండగ ఏర్పాటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 6432 బస్సులను నడపనుంది. ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% చార్జీలు వసూలు చేసేందుకు ప్రయాణికులు మందపడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 366 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి, యాదాద్రి – భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. 16 గంటలకు 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలు పంపించారు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. హైదరాబాదు నుంచి ఏపీలోనే వేరువేరు ప్రాంతాలకు ప్రత్యేకంగా హైటెక్, వోల్వో బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు గుర్తించారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతికి ఈ బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ నేపథ్యంలో విమాన సంస్థలకు కాసుల వర్షం కురుస్తోంది. పండగ వేళ హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వెళ్లే విమాన సర్వీసుల టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాదు నుంచి విశాఖపట్నంకి శని, ఆదివారాల్లో 17 నుంచి 18 వేల మధ్య టిక్కెట్లు ధరలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆదివారం టికెట్ ధర రూ.16,976గా ఉంది. రాజమండ్రికి రూ.15,086 గా ఉంది. బెంగళూరు నుంచి విశాఖ, రాజమండ్రి, విజయవాడకు రెండు, మూడు రెట్లు టికెట్ల ధరలు పెరిగాయి. బెంగళూరు నుంచి విశాఖ టికెట్ ధర రూ.17,391 ఉండగా, రాజమండ్రికి రూ.16,357 ఉంది. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు గురవుతున్నాయి. రెండు మూడు రెట్లు అదనంగా బస్సు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నాయి.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇవే.!
జుట్టు ఒత్తుగా, పొడవు పెరగాలంటే 8 యోగాసనాలు చేయండి చాలు