బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం లభిస్తుంది అన్నదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి 2023 జూలైలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని నియమించడం ఖాయమని సూచించబడుతుంది. ఈ పదవి కోసం దాదాపు పదిమంది పోటీ పడుతున్నారు. పోటీలో పడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి పివిఎన్ మాధవ్, కోస్తా నుంచి పాకా సత్యనారాయణ వంటి నేతలను పరిగణలోకి తీసుకోని ప్రచారం జరుగుతుంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ పదవి కోసం దాదాపు పదిమంది పోటీ పడుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పేరును పురుగు రాష్ట్రానికి చెందిన ఒక కేంద్రమంత్రి సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
తనకు పొత్తులో సీటు దక్కలేదని, రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించాలని జాతీయ లేబర్ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఢిల్లీ ప్రజలకు విన్నవించినట్లు సమాచారం. ఇటీవల విశాఖలో కోర్ కమిటీ భేటీలో పార్టీ శాఖ సహాయ ఇంచార్జ్ శివప్రకాష్ పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఢిల్లీ ఎన్నికల్లో నిమగ్నమైన అగ్రనేతలు కొత్త అధ్యక్షుల నియామకంపై అభిప్రాయాలు పంపండి అని ముఖ్య నేతలకు తెలిసింది చెప్పినట్లు తెలిసింది. ఆశావా నేతలంతా ఇప్పటికే తన ప్రయత్నాల్లో ఉన్నారు. వారితో ఉన్న పరిచయాలు, సంబంధాల ద్వారా రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందేందుకు పలువురు కీలక నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఆశావహ నేతల్లో కొందరు ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలు ద్వారా ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర అధ్యక్ష పదవిని పొందేందుకు సీనియర్ నేతల పోటీ పడుతుండడంతో ఎవరికి ఈ పదవి దక్కుతుందో అన్న ఆసక్తి సర్వత్ర ప్రకటన.
గీత కులాలకు 335 మద్యం షాపులు కేటాయింపు.. లైసెన్సులు ఎంపికకు లాటరీ విధానం
ఆరోగ్యకరమైన పళ్ల కోసం ఈ ఆహార పదార్థాలు ట్రై చేయండి..