వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేశారు, జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు సంబంధించి విచారణ ప్రక్రియను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్ నాగరత్న, న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ ప్రకటించారు. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం. దీంతో హైకోర్టు ఆశ్రయించాలని పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామకృష్ణరాజు తరఫు లాయర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. దీంతో సుప్రీం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అదే సమయంలో ట్రయల్ వేగంగా సాగాలని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం ఇచ్చింది. జగన్ కేసును తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని, ప్రజా ప్రతినిధుల విషయంలో రోజువారీ విచారణ చేపట్టాలంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని ధర్మాసనం. రైల్ కోర్ట్ అలా జరుపుతుందో లేదో హైకోర్టు సూచన విచారణ చేసింది.
అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌కు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్లు తెలియాల్సి ఉంది. సుప్రీం తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం డిస్మిస్ చేయడం వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పక్షాన దేవుడు నిలబడ్డాడు అంటూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి సుప్రీం తీసుకున్న నిర్ణయం పట్ల రఘురామకృష్ణంరాజు ఎలా ఉన్నారో చూడాల్సి ఉంది. హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు లాయర్ తీర్పు.
నిరుద్యోగులకు శుభవార్త.. బీసీ స్టడీ సర్కిల్స్ లో ఉచిత ఫౌండేషన్ కోర్స్
ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహారాలు తినాలంటే..