బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలనుకుంటారు చాలామంది. కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. సరైన వ్యాయామాలు చేస్తూ, బరువును అదుపులో ఉంచుకుంటూ తగిన విధంగా డైట్‌ను ప్లాన్ చేసుకుంటే అధిక బరువు బారిన పడే సమస్యే ఉండదు. అయితే దీనికోసం తక్కువ క్యాలరీలున్న ప్రతికూల ఆహారాన్ని ప్రతికూల కేలరీల ఆహారం (నెగెటివ్ క్యాలరీ ఫుడ్) ఎంచుకోవచ్చు.
ఇప్పుడు చాలామంది ఇదే ఫార్ములాను గుర్తించారు. నెగె క్యాటివ్‌లరీలు అంటే.. సాధారణంగా ఏదైనా ఫుడ్ తింటే అది జీర్ణం అయ్యి, దాని నుంచి క్యాలరీల రూపంలో మనకు ఎనర్జీ వస్తుంది. అయితే ఇలాంటి ప్రతికూల ఆహారాల విషయంలో ఇది వేరేలా జరుగుతుంది. ఈ నెగెటివ్ క్యాలరీ ఫుడ్స్ ఇచ్చే క్యాలరీల కన్నా, వీటిని అరిగించడం కోసం శరీరం ఖర్చు చేసే క్యాలరీలే ఎక్కువ. అంటే… ఇలాంటి ప్రతికూల ఆహారాన్ని తినడం వల్ల తక్కువ క్యాలరీలు అందుతూ.. శరీరం నుంచి ఎక్కువ క్యాలరీలు కరుగుతాయన్నమాట. మరి ఈ నెగెటివ్ క్యాలరీల జాబితాలో ఉండే ఆహార పదార్థాలను మనమూ ఒకసారి చూసేద్దామా..
బెర్రీస్ బెర్రీలను నెగెటివ్ క్యాలరీ ఫుడ్ అంటారు,
క్యారియస్ ను నెగెటివ్ ఫుడ్ అంటారు. వీటిలో హై ప్రొటీన్ ఉంటుంది. బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాపాడతాయి. అరకప్పు ఆహారంలో కేవలం 32 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పైగా ఇవి తిన్నప్పుడు త్వరగా కడుపునిండిన భావన కలుగుతుంది.
టొమాటో వంద గ్రాముల టొమాటోలో 19 కేలరీలు మాత్రమే ఉంటాయి
ఇది కూడా ప్రతికూల ఆహార పదార్థమే.. వంద గ్రాముల టొమాటోలో కేవలం19 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో ఫైబర్, పొటాషియంతో పాటు విటమిన్ సి కూడా ఎక్కువ. అందుకే వీటిని డైట్‌లో చేర్చితే బరువు తగ్గడం సులభం.
దోసకాయ దోసకాయలో 15 కేలరీలు మాత్రమే ఉంటాయి
వంద గ్రాముల దోసకాయలో 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇవి ఒక కప్పు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. వీటిలో నీటి శాతం ఎక్కువ. దోసకాయ శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, మినరల్లను అందిస్తుంది. అలాగే డైటరీ ఫైబర్‌ను అందిస్తుంది.
పుచ్చకాయ 100 గ్రాముల పుచ్చకాయలో 30 కేలరీలు
వంద గ్రాముల పుచ్చకాయలో 30 క్యాలరీలు ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది, కడుపు చల్లగా ఉంటుంది. పుచ్చకాయ గింజలు రక్తహీనతను నివారిస్తాయి. ఇందులోని సి, బి6 విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యారెట్స్ 100 గ్రాముల క్యారెట్‌లో 41 కేలరీలు ఉన్నాయి
వంద గ్రాముల క్యారెట్స్‌లో 41 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఇందులో పీచుపదార్థాలు, విటమిన్లు ఎక్కువ. క్యారెట్స్ తింటే త్వరగా ఆకలి వేయదు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు..
యాపిల్ వంద గ్రాముల యాపిల్‌లో 50 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి
ఆపిల్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ తింటే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వంద గ్రాముల ఆపిల్ లో కేవలం 50 గ్రాముల క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే బరువు తగ్గడానికి ఆపిల్స్ బెస్ట్ ఆప్షన్.
బ్రోకోలి వంద గ్రాముల బ్రోకలీలో 34 కేలరీలు మాత్రమే ఉంటాయి
వంద గ్రాముల బ్రోకోలిలో 34 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. త్వరగా కడుపు నిండిన భావన కలగడంతో పాటు శరీరంలో కొవ్వు కరగడానికి బ్రోకోలి బాగా ఉపయోగపడుతుంది.