- అజేయ భాగస్వామ్యంతో రాణించిన రాహుల్, జడేజా
- 1–0 తో ముందంజలో అత్యుత్తమ
- 19న విశాఖలో రెండో వేదిక
ఇటీవల: భారత్ – ఆస్ర్టేలియాల మధ్య కొనసాగుతున్న డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ర్టేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 35.4 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయింది 188 పరుగులు. 189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌తక్కువ పరుగుల వద్దే కీలకమైన ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాల అజేయ భాగస్వామ్యం భారత్‌ను విజయతీరాలకు చేరేలా చేసింది. కేవలం 39.5 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు. దీంతో భారత్ మూడు వేదికల సీరియస్‌లో 1–0తో అధిక్యతలో ఉంది. రెండో వన్డే విశాఖపట్టణంలో 19వ తేదీన జరగనుంది.
ఆస్ర్టేలియా పరుగులు: ట్రావీస్ హెడ్ (5), మిచెల్ మార్ష్ (81), స్టీవెన్ స్మిత్ (కెప్టెన్) (22), లబూషేన్ (15), జోష్ ఇంగ్లీస్ (26), కామెరూన్ గ్రీన్ ( 12), గ్లెన్మాక్స్వెల్ (8), స్టోయినీస్ (5), అబ్బోట్ (0), మిచెల్ స్టార్క్ (4నాటౌట్), ఆడమ్ జంపా (0).
వికెట్లు: మహ్మద్ షమీ (3), మహమ్మద్ సిరాజ్ (3), రవీంద్ర జడేజా (2), హర్ధిక్ పాండ్యా (1), కుల్దీప్ యాదవ్ (1).
భారత్ పరుగులు: ఇషాన్‌ఖాన్ (3), శుభ్‌మన్గిల్ (20), విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ యాదవ్ (0), కెఎల్ రాహుల్ (75నాటౌట్), హర్ధిక్ పాండ్యా (25) , రవీంద్ర జడేజా (45నాటౌట్).
వికెట్లు: మిచెల్ స్టార్క్ (3), స్టోయినీస్ (2).