- సెంచరీతో చెలరేగిన డీ కాక్
- హాఫ్సెంచరీ సాధించిన మార్కమ్
లక్నో: సౌతాఫ్రికా–ఆస్ట్రేలియా మధ్యలక్నోలో గురువారం కొనసాగిన 10వ వరల్డ్ కప్ వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు. టాస్‌తో గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ను సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన క్వింటన్ డీ కాక్ 106 బంతుల్లో 8 ఫోర్లు, ఐదు సిక్స్‌లతో 109 పరుగులు సాధించాడు. బావుమా (కెప్టెన్) 35 పరుగులు, దుస్సేన్ (26) పరుగులు సాధించగా, ఏడెన్ మార్కమ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 56 పరుగులు సాధించాడు. హెన్రీచ్ క్లాసెన్ 29 పరుగులు, డేవిడ్ మిల్లర్ 17, మార్కో జాన్సెన్ 26 పరుగులు, రబాడా 0, మహరాజ్ 0 పరుగుల వద్ద ఆటను ముగించారు. ఇన్నింగ్స్‌లో 13 ఎక్స్‌ట్రాలు నమోదయ్యాయి. 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయింది 31 పరుగులు సాధించి ఆస్ట్రేలియాకు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని సౌతాఫ్రికా నిర్దేశించింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ 2, గ్లెన్ మాక్స్ వెల్ 2, జోష్ 1, పాట్ కమ్మిన్స్ 1, ఆడమ్ జంపా 1 వికెట్లు సాధించారు.