- నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా గెలుపు
ఇటీవల:ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 24వ లీగ్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. నెదర్లాండ్స్ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న నెదర్లాండ్స్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో అత్యంత భారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా..309 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసి 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసింది. ఫలితంగా.. 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ రేసులో తమ కోసం మరింత పదిలం చేసుకున్నారు.